చికిత్స పొందుతూ రైతు మృతి
అమరచింత: రైతు బాలస్వామి(42) మూడు రోజుల క్రితం గడ్డిమందు తాగగా.. హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన గొల్ల బాలస్వామి తన పొలం పక్కన ఉన్న చంద్రన్న అనే రైతు పొలంలోని గెట్టును తొలగించాడంటూ నాలుగు రోజుల క్రితం గొడవపడ్డారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా చంద్రన్న సైతం తనపై, భార్యాపిల్లలపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలస్వామి తన పొలం గెట్టును అక్రమించుకోవడమే కాకుండా తన కుటుంబంపై పోలీసు కేసు పెడతాడా అంటూ మనస్తాపం చెందాడు. మూడు రోజుల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ కోలుకోలేక చికిత్సపొందుతూ మరణించాడు. మృతుడికి భార్య సావిత్రితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment