ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
షాద్‌నగర్ రూరల్: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఆమైపె అనుమానం పెంచుకున్నాడు.. కన్నకూతురు ముందే తల్లిపై దాడి చేశాడు. దెబ్బలు తాళలేక మహిళ అక్కడే మృతిచెందింది. విషయం బయటకు తెలిస్తే కటకటాల పాలవుతానని గ్రహించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన పావని (35) తన కూతురు జ్యోతిశ్రీతో కలిసి కొంతకాలం క్రితం షాద్‌నగర్‌కు వచ్చింది. పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ కూతురుతో కలిసి రైల్వేస్టేషన్, జాతీయ రహదారి సమీపంలో నివసిస్తోంది. కర్నూలు జిల్లా ఆలూర్ మండలం జోలాపూర్ గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశ్ షాద్‌నగర్‌లో కూలీ పని చేస్తూ పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఉండేవాడు. ఈ నేపథ్యంలో పావనికి వెంకటేశ్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 15న రాత్రి సమయంలో బుచ్చిగూడ రోడ్డులోని బైపాస్ బ్రిడ్జి కింద నిద్రిస్తున్న పావనితో వెంకటేశ్ గొడవపడ్డాడు. ఈ నెల 14వ తేదీ ఎక్కడికి వెళ్లావని మృతురాలు పావనితో వాగ్వాదానికి దిగాడు. తన సొంత ఊరులో ఉన్న భర్త వద్దకు వెళ్లానని చెప్పడంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్ కర్రతో అమానుషంగా ఆమైపె దాడి చేశాడు. అప్పటికీ పావని మృతి చెందలేదని తెలుసుకుని ఇనుప సలాకతో తల, నుదుటిపై కొట్టడంతో రక్తస్రావమై చనిపోయింది. తల్లిపై దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన జ్యోతిశ్రీపై కూడా దాడి చేశాడు. పోలీసులకు తెలిస్తే నేరం బయట పడుతుందని భావించిన వెంకటేశ్ తెల్లవారిన తర్వాత.. నీకు టీ తెస్తా నువ్వు అమ్మ దగ్గరే ఉండూ అంటూ జ్యోతిశ్రీకి చెప్పి సొంతూరుకు పారిపోయాడు. మహిళ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. వెంకటేశ్ కర్నూలులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగాా నేరం అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన కర్ర, ఇనుప సలాక(సీకు)ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంకటేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్ పర్యవేక్షణ, ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన పట్టణ సీఐ విజయ్‌కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శరత్‌కుమార్, పోలీసు సిబ్బంది కరుణాకర్, రఫీ, మహేశ్, రాజును అభినందించారు.
మహిళ హత్య కేసును ఛేదించిన షాద్‌నగర్ పోలీసులు
నిందితుడికి రిమాండ్
వివరాలు వెల్లడించిన
పట్టణ సీఐ విజయ్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment