అవయవదానంపై అవగాహన పెరగాలి
పాలమూరు: మరణానంతరం నేత్ర, శరీర అవయవ దానాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నేత్ర, శరీర అవయవ దాతల అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ గంజి ఈశ్వర్ లింగం అన్నారు. జిల్లాకేంద్రంలోని రెడ్‌క్రాస్ సొసైటీ సమావేశ మందిరంలో ఆ సంఘం జిల్లా కన్వీనర్ వేణుగోపాల్ వర్మ అధ్యక్షతన నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కుటుంబంలో ప్రతి ఒక్క సభ్యుడికి అవగాహన కల్పించి.. అవయవాలను దానం చేసే విధంగా చైతన్యం చేయాలన్నారు. జీవిస్తూ రక్తదానం, మరణించి అవయవాలను దానం చేయాలని సూచించారు. నేత్రదానం చేయడం వల్ల అంధులకు చూపు కల్పించిన వాళ్లం అవుతామని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంమోహన్, ఐక్యవేదిక డైరెక్టర్ మల్లారెడ్డి, గైనిక్ వైద్యురాలు ధనశ్రీ, బాబుల్‌రెడ్డి, చంద్రశేఖర్, శివకుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment