ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఏసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కల్వరి ఎంబీ చర్చి ఆవరణలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ ప్రేమ విందు ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనించాలని అన్నారు. అందరూ సంతోషంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో అధికారికంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందన్నారు. అనంతరం ఎంబీ చర్చి చైర్మన్, పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే తదితరులు క్రి స్మస్ కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. విందు లో ఎమ్మెల్యే, కొత్వాల్ భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, అడిషనల్ ఎస్పీ రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీ ర్ అహ్మద్, ఆర్డీఓ నవీన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్, డీసీసీ మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, ఎంబీ చర్చి వైస్ చైర్మన్ బీఐ జేకబ్, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
పాలమూరులో ప్రభుత్వం తరఫునక్రిస్మస్ విందు
Comments
Please login to add a commentAdd a comment