హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ(పీయూ)లోని హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈమేరకు వీసీ శ్రీనివాస్‌తో పాటు రిజిస్ట్రార్ చెన్నప్ప విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేష్‌తేజ మాట్లాడారు. హాస్టళ్లలో మెరుగైన భోజనం అందించాలని, శానిటేషన్ పాటించాలని కోరారు. పీయూలో ఉన్న అన్ని సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని, రెగ్యులర్ అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు. పీయూకు మంజూరైన లా, ఇంజినీరింగ్ కళాశాలల్లో హాస్టళ్లను వెంటనే నిర్మించాలన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం పీయూ ముఖద్వారం వద్ద రెక్వెస్ట్ బస్టాప్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఫలితాలు వెల్లడించడం లేదన్నారు. ఈమేరకు 30 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణకుమార్, వేణుగోపాల్, నాగేష్, రవితేజ, భాను, వినోద్, రవి పాల్గొన్నారు.
పీయూలో విద్యార్థుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment