ఆలయంలో గుండెపోటుతో వ్యక్తి మృతి
అలంపూర్ : అలంపూర్ క్షేత్ర ఆలయాల సముదాయంలోని పరిసరాల్లో హైదరాబాద్‌కు చెందిన మాణిక్‌ప్రభు(58) అనే వ్యక్తి గుండెపోటుతో మంగళవారం మృతిచెందినట్లు ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. వివరాలు.. హైదరాబాద్‌లోని ఉప్పుగుడాకు చెందిన మాణిక్‌ప్రభు, తల్లి విమలబాయ్‌తో కలిసి సోమవారం అలంపూర్ క్షేత్ర ఆలయాలకు వచ్చారు. ఆలయాలను దర్శించుకొని అమావాస్య కావడంతో ఆలయాల పరిసరాల్లో రాత్రి నిద్రించాడు. తెల్లవారుజామున తల్లి మాణిక్‌ప్రభువును లేపగా కదలకపోవడంతో చుట్టూపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మాణిక్‌ప్రభు మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లి విమలబాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య జ్యోతి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment