మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: దుకాణాలను మూసేసి అద్దె చెల్లించకుండా ఉంటే జప్తు చేస్తామని మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం న్యూటౌన్‌లోని ఐడీఎస్‌ఎంటీ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. ఇక్కడ కొన్ని నెలలుగా మూసేసిన (సెల్ఫ్ లాక్) కే6000 దుస్తుల దుకాణదారు నుంచి సుమారు రూ.45 లక్షలు, నజీబ్ హార్డ్‌వేర్ షాపు నుంచి సుమారు రూ.12 లక్షలు మున్సిపాలిటీకి రావాల్సి ఉందని ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా వివరించారు. దీంతో ఈ రెండు దుకాణాలలో ఉన్న వస్తువులను జప్తు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సదరు యజమానుల నుంచి ఈ బకాయిలను వసూలు చేయాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇదే కాంప్లెక్స్‌లో రెండు టీ కొట్లు, ఓ హోటల్–టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులను ఖాళీ చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment