ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి
● రహదారిపై కుటుంబ సభ్యుల ఆందోళన
కోటపల్లి(చెన్నూర్): ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పానెం గంగయ్య, గంగమ్మ దంపతుల కుమారుడు సూర్యకిరణ్ (25) మంగళవారం ద్విచక్ర వాహనంపై పొలం పనులకు వెళ్తుండగా లక్ష్మీపూర్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఎద్దును తప్పించే క్రమంలో సిరోంచ నుంచి చెన్నూర్ వైపు వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో జాతీయ రహదారిపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రాత్రివరకూ ఆందోళన విరమించలేదు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా నీల్వాయి ఎస్సై శ్యామ్‌పటేల్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment