నీలుగాయి మాంసం పట్టివేత
కడెం: మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన రాయ అంకులు ఇంట్లో గురువారం 5 కిలోల నీలుగాయి మాంసం పట్టుకున్నట్లు కల్లెడ డీఆర్వో డి.ప్రకాశ్ తెలిపారు. ఆటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చమని, తనతోపాటు మరో ఇద్దరు సీపెల్లి బీమన్న, మాకరెడ్డి ఉన్నారని అంకులు ఒప్పుకున్నట్లు ఆటవీ అధికారులు తెలిపారు. పరారీలో ఇద్దరు నిందితులు ఉన్నారని, ముగ్గురిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఆర్వో పేర్కొన్నారు. ఎఫ్‌బీవోలు ప్రసాద్, సరిత సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment