ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ క్రికెట్ అసో సియేషన్ ఆధ్వర్యంలో అండర్–14 జిల్లా క్రికెట్ టీం ఎంపిక పోటీలను పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. గురువారం ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి 100 మంది హాజరుకాగా, ప్రతిభ కనబర్చిన 18 మందిని జట్టుగా ఎంపిక చేశా రు. జిల్లా సెక్రెటరీ కోదాటి ప్రదీప్, హెచ్‌సీఏ జిల్లా కోచ్ పి.ప్రదీప్, చందు, తిరుపతి, సుధీర్, రాకేశ్ పాల్గొన్నారు.
ఎంపికై న జట్టు క్రీడాకారులు..
ఉమ్మడి జిల్లా జట్టులో మంచిర్యాల నుంచి వి.లక్ష్మ ణ్ సాయి, బి.అర్జున్, ఏ.రిషికేష్ చంద్ర, ఆదిలా బాద్ నుంచి పి.మోక్షిత్, జే.అన్వేష్, యశ్‌రాజ్ సింగ్, అనాస్, డి.రిషి, బి.దినేశ్ రాజ్, కే.ఇషాంత్, కె.వర్శిల్, నిర్మల్ నుంచి ఆర్.ధనుష్, మీర్జా రుబ్బన్, వై. రోహిత్‌లు, స్టాండ్ బైలో మంచిర్యాల నుంచి ఎస్‌కె జహీర్, టి.సాత్విక్, నిర్మల్ నుంచి ఈ. శైలేష్, ఆదిలాబాద్ నుంచి శౌర్యలను ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment