టామ్‌కామ్‌తో భరోసా
● ఉపాధి బాటపట్టే నిరుద్యోగులకు ● విదేశాలకు వెళ్లే వారికి ప్రభుత్వ సహకారం ● నైపుణ్యశిక్షణతో ఉద్యోగావకాశాలు
అవకాశాలు
వినియోగించుకోవాలి
విదేశాలకు వెళ్లాలనుకునే వారు గల్ఫ్ ఏ జెంట్ల బారినపడి మోసపోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న టామ్‌కామ్ సంస్థ ద్వారా సరైన రంగంలో ఉ పాధి పొందేందుకు అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లడానికి రిజిస్టర్ చేసుకుంటే అర్హతలు, నైపుణ్యానికి సరిపడా ఉద్యోగం లభి స్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– స్వదేశ్ పరికిపండ్ల, గల్ఫ్ కార్మిక సంఘం ప్రతినిధి, నిర్మల్
నిర్మల్‌ఖిల్లా: ఉన్న ఊరిలో సరైన ఉపాధి అవకాశాలు దొరకక గల్ఫ్ బాటపడుతున్న ఉమ్మడి జిల్లావాసులు వేలల్లో ఉన్నారు. ఇంటికి తిరిగి రాలేక అక్కడ సరైన ఉపాధి అవకాశాలు దొరకక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సమస్యలు తలెత్తకుండా విదేశాల్లో సరైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్)బాసటగా నిలుస్తోంది. 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటుచేసింది. ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారి విద్యార్హతలు, నైపుణ్యం మేరకు వివిధ దేశాల్లో ఉన్న ఖాళీల ప్రకారం కొలువులు సమకూర్చే విధంగా సేవలందిస్తోంది. సరైన ఉపాధి అవకాశాల కోసం కావాల్సిన నైపుణ్యాలపై శిక్షణ ఆధ్వర్యంలో అందిస్తోంది.
ప్రభుత్వ సహకారంతోనే..
విదేశాలకు వెళ్లాలనుకునే నిరుద్యోగులకు అక్కడ ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టామ్‌కామ్ దాదాపు 20కిపైగా దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇక్కడివారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఉద్యోగాల కల్పన కోసం హైదరాబాద్‌లో విదేశీ ఉద్యోగాలకు సంబంధించిన స్కిల్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో ఐటీఐ, తదితర వృత్తి కోర్సులు చేసుకుని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల్లో నమోదు చేసుకుని ఉన్న వారి కోసం టామ్‌కామ్ సమన్వయంతో నిరుద్యోగులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటివరకు యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, ఇజ్రాయిల్, ఇరాక్, బహ్రెయిన్, జపాన్, జర్మనీ, యు ఎస్‌ఏ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా తదితర 20 దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆయా చోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.
ఈ రంగాల్లో మంచి డిమాండ్..
టామ్‌కామ్ ఒప్పందం కురిసే కుదుర్చుకున్న దేశాల్లో వెల్డింగ్, ఎలక్ట్రీషన్ వంటి పనులతోపాటు భవన నిర్మాణరంగం, డ్రైవింగ్, డెలివరీ బాయ్స్, ఇండస్ట్రీయల్ టెక్నీషియన్‌తోపాటు హాస్పిటల్ రంగాల్లో నర్సింగ్ విభాగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో నైపుణ్యం కలిగిన నిరుద్యోగులకు అక్కడ మంచి వేతనాలతో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లాకు చెందిన నిరుద్యోగులు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలతో టామ్‌కామ్ వెబ్‌సైట్ ద్వారా గానీ, మొబైల్‌లోని ప్లే స్టోర్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ కావల్సి ఉంటుంది. ఆయా దేశాల్లో ఉద్యోగావకాశాలను చూసుకోవచ్చు. ఆ యాప్‌లో అభ్యర్థుల నైపుణ్యాలు, అర్హతల వివరాలను నమోదు అనంతరం సంబంధిత అధికారుల సహకారం తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment