కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య
ఇంద్రవెల్లి: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూ కుటుంబీకులు, ఎస్సై సునీ ల్ తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని ప్ర బుద్ధనగర్ కాలనీకి చెందిన వాగ్మారే క్రాంతికుమార్(36), మేజర్ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గతకొంత కాలంగా కడపునొప్పితో బాధపడుతున్నాడు. కుటుంబ స భ్యులు పలు ఆస్పత్రులతోపాటు నాటు వైద్యం చే యించినా నయం కాలేదు. కడుపునొప్పి ఎంతకీ త గ్గకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. గురువా రం ఇంటి వరండాలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిద్ర లేచిన భార్య కాంతబాయి బయట కు వచ్చి చూడగా..భర్త ఉరేసుకుని కనిపించాడు. విష యం తెలుసుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం పోసుమార్టం కో సం మృతదేహాన్ని ఉట్నూర్ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
పురుగుల మందు యువకుడు..
చెన్నూర్: పట్టణంలోని మహంకాళివాడకు చెందిన యువకుడు లక్కాకుల సంతోశ్ (25) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై సుబ్బారావు కథనం ప్రకారం..సంతోశ్ చెన్నూర్‌లోని ముత్తుట్‌ఫైనాన్స్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గతంలో కిడ్నీలో రాళ్లు రాగా సర్జరీ అయింది. విధుల్లో ఉన్న సంతోశ్ బుధవారం మధ్యాహ్నం నడుం నొస్తుందని ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి ఫోన్ చేసి గోదావరి నది వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గోదావరి నది వద్దకు వెళ్లి ఆపస్మారక స్థితిలో పడి ఉండడంతో చెన్నూర్ ఆసుపత్రికి తరలించారు. పరి స్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. గురువారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిడ్నీ నొప్పి భరించలేక పురుగుల మందు తాగి మృతి చెందాడని అన్న లక్కాకుల సాయి ఫి ర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపా రు. మృతుడికి తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment