జీరో హార్మ్ సింగరేణి నినాదం
● జీఎం ఎల్వీ సూర్యనారాయణ
శ్రీరాంపూర్: జీరో హార్మ్ సింగరేణి నినాదమని శ్రీరాంపూర్ జీఎం ఎల్వీ సూర్యనారాయణ తెలిపారు. గురువారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్‌గనిలో 50వ రక్షణ వార్షిక పక్షోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడుతూ సింగరేణిలో రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి ఇంటి నుంచే రక్షణతో విధులకు హాజరుకావాలన్నారు. రక్షణ పరికరాలైన బూట్లు, హెల్మెట్, రేడియం జాకెట్ యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ప్రతి ఉద్యోగి రక్షణ సూత్రాలను పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు రక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. 2022 వార్షిక రక్షణ ఔపక్షోత్సవాల్లో సాధించిన 3వ బహుమతిని అందించారు. గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి ఎస్కే బాజీసైదా, శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు అధికారి టి.శ్రీనివాస్, ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, రక్షణ కమిటీ సభ్యులు గార్బియల్ రాజు, మహేంద్రనాథ్, హనుమాన్‌గౌడ్, మురళీధర్, గని మేనేజర్ బ్రహ్మాజీ, రక్షణ అధికారి శ్రీనివాస్, సంక్షేమాధికారి బి.శంకర్, ఫిట్ కార్యదర్శి మోతె లచ్చన్న పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment