మంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలో ఇటీవల వేర్వేరు చోట్ల జరిగిన బైక్ చోరీకేసులో ఒకరికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్‌క్లాస్, జూనియర్ సివిల్ జడ్జి కె.నిరోష గురువారం తీర్పువెలువరించారు. కోర్టు లైజన్ అధికారి గులాం దస్తగిర్ కథనం ప్రకా రం..జిల్లాకేంద్రంలోని గౌతమినగర్‌కు చెందిన మారుకొండ సాయికుమార్, అదిలాబాద్ జిల్లా తింతోలికి చెందిన మెస్రం శివప్రసాద్, మంచిర్యాల హమాలివాడకు చెందిన మత్తోజు రమేశ్‌బాబుల మూడు బైక్‌లను 2021 జూన్ 5, 7 తేదీల్లో చోరీకి గురయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై వి.ప్రవీణ్‌కుమార్ కేసు న మోదు చేశారు. నిందితుడు నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన మ హ్మద్ రజఖ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పీపీ ఎన్.రవీందర్ న్యాయమూర్తి ఎదుట విచారణ చేయగా నేరం రుజువు కావడంతో జడ్జి ఈమేరకు తీర్పునిచ్చారని లైజన్ అధికారి తెలిపారు.
అశ్వినికి రిమాండ్
ముధోల్: మండల కేంద్రంలో బుధవారం వదిన మరదలపై కత్తితో దాడి చేసిన ఘటనలో వదిన అశ్వినికి గురువారం రిమాండ్ విధించారు. సీఐ మల్లేశ్ కథనం ప్రకారం..మరదలు తనుజ పెళ్లి కోసం అన్న డబ్బులు ఖర్చు పెడతాడని ఉద్దేశంతో ఆమెను హత్య చేసేందుకు పూనుకుంది. తనుజపై కత్తితో దాడి చేసినట్లు విచారణలో వెల్లడించిందని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment