ఉట్నూర్‌రూరల్: 108, 102 సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్ అన్నారు. శుక్రవారం మండలంలోని జీవీకే ఈఎంఆర్‌ఐ 108 డివిజన్ కార్యాలయాన్ని 108, 102 అంబులెన్స్ వాహనాలను తనిఖీ చేసి రికార్డులు, వాహనాల నిర్వహణ, వైద్య పరికరాల పనితీరు పరిశీలించారు. వాటి ఉపయోగాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రతీ కేసు వచ్చిన వెంటనే సిబ్బంది త్వరితగతిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు వైద్య సహాయం అందించాలని, గిరిజన ప్రాంతాల్లో మండల ప్రజలకు అందుబాటులో ఉండి మంచి నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ రాజశేఖర్, 108, 102 సిబ్బంది శంకర్, దత్తు, నాందేవ్, ప్రవీణ్, రవీందర్, నాగమణి, రాజశేఖర్, ధరంసింగ్, ప్రవీణ్, అంజన్న, వెంకటేశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment