మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదిత మ్యాప్ సిద్ధం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. నస్పూర్ మున్సిపాలిటీ, హాజీపూర్ మండలంలోని కొన్ని గ్రామాలను కలుపుకుని తయారు చేసిన కార్పొరేషన్ ప్రతిపాదిత మ్యాప్ సిద్ధమైంది. దాదాపుగా ఇదే తరహాలో మంచిర్యాలను కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేయగా, మంచిర్యాల, నస్పూరు మున్సిపాలిటీలతోపాటు హాజీపూర్ మండలంలోని వేంపల్లి, కొత్తపల్లి, ముల్కల్ల, పోచంపహాడ్, గుడిపేట్, నంనూరు, నర్సింగాపూర్, చందనాపూర్ గ్రామాలను విలీనం చేసేలా మ్యాప్‌ను రూపొందించారు. ఇప్పటికే కార్పొరేషన్‌కు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందించగా, తుది రూపుకు మారితే, అందులో ఏవైనా మా ర్పులు చేస్తే మ్యాప్ కూడా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment