ఆయిల్‌పామ్ సాగు.. లాభాలు బాగు
● చేతికొచ్చిన పంట ● టన్నుకు రూ.20,430 ● జిల్లాలో చెన్నూర్ నియోజకవర్గం టాప్
చెన్నూర్: జిల్లాలో సాగవుతున్న కొత్త పంట లాభాలు తెచ్చిపెడుతోంది. మంచిర్యాల జిల్లాలో 869 మంది రైతులు 3092 ఎకరాలలో ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది నుంచి ఆయిల్‌పామ్ పంట చేతికొస్తుంది. ఈ ఏడాది ఆయిల్‌పామ్ గెలలు టన్ను ధర రూ. 20,430 పలుకుతుంది. దీంతో రైతులు లాభాల బాట పడుతున్నా రు. జిల్లాలో చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, కోటపల్లి, జైపూర్, భీమారం మండలాలలో ఆయిల్‌పామ్ తోటలను ముందుగా సాగు చేశారు. పంట దిగుబడి సైతం ముందుగా రావడంతో రైతులు పంట లాభాలు అర్జిస్తున్నారు. గత ఏడాది టన్నుకు రూ.17,114 ఉండగా ఈ ఏడాది ధర ఆమాంతం రూ.3000లకు పైగా పెరిగింది. దీంతో రైతులు పంట ద్వారా లాభాలు పొందుతున్నారు.
విదేశీ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు..
ఆయిల్‌పామ్ ధర విదేశీ మార్కెట్‌లో పెరగడంతో ఈ ఏడాది టన్నుకు రూ. 20,430 పలుకుతుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 2022 కరోనా సమయంలో పంట దిగుబడి తక్కువ ఉండడంతో రికా ర్డు స్థాయిలో ఆయిల్‌పామ్ టన్నుకు రూ.23 వేలు పలికింది. ఈ ఏడాది సైతం టన్నుకు సుమారు రూ. 22 వేలకు పైగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
అంతర పంటల సాగు..
ఆయిల్‌పామ్ మొక్కలను ఎకరానికి 57 మాత్రమే నాటడంతో మొక్కమొక్కకు మధ్య మూడు మీటర్ల కు పైగా దూరం ఉంటుంది. దీంతో రైతులు ఇటు ఆయిల్‌పామ్‌తో పాటు కూరగాయలు, పత్తి, బబ్బెర సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్ పంట చేతికొచ్చే వరకు రైతులు అంతర్‌పంట ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు.
ఎకరానికి రూ.4200 సబ్సిడీ..
ఆయిల్‌పామ్ పంటకు ప్రభుత్వం ఎకరానికి రూ. 4200 చెల్లిస్తుంది. ఇందులో రూ. 2100 ఎరువులు, మందుల కోసం కాగా రూ. 2100 అంతర్ పంట సాగు కోసం ప్రభుత్వం సబ్సిడీ కింద మంజూరు చేస్తుంది. దీంతో రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు రెండింతలయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మ్యాట్రిక్స్ కంపెనీ ఆధ్వర్యంలో..
రైతులు పండించిన పంటను మ్యాట్రిక్స్ ఆయిల్‌పామ్ కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేస్తున్నారు. ఈ కంపెనీ ఆధ్వర్యంలో భీమారం మండల కేంద్రంలో ఆయిల్‌పామ్ మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నారు. 2025లో జిల్లాలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభించేందుకు మ్యాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు.
100 టన్నుల దిగుబడి వస్తుంది..
నేను 10 ఎకరాలలో ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తున్న. ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుంది. 10 ఎకరాలకు 100 టన్నులకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది టన్ను ధర పెరిగింది. అంతర్ పంట సైతం సాగు చేస్తున్న. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు లాభమే.
– వెన్నపురెడ్డి బాపురెడ్డి, చెన్నూర్
Comments
Please login to add a commentAdd a comment