క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
తలమడుగు: ఈ ప్రాంత క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అన్నా రు. మండలంలోని ఖోడద్ జెడ్పీ పాఠశాలలో ఉమ్మడి జిల్లాస్థాయి ఖోఖో పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడారంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కప్ పేరిట పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామగుండం ఏఎస్పీ నర్సింహులు మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యంతో క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను బోరంచు శ్రీకాంత్ రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ సాకే ఆనంద్, ట్రైబల్ వెల్ఫేర్ క్రీడా అధికారి పార్థసారథి, బీఆర్‌ఎస్ బోథ్ అధికా ర ప్రతినిధి కిరణ్, కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రాష్ట్రపాల్, గ్రామ యూత్ ప్రెసిడెంట్ శివకుమార్, వెంకట్ రెడ్డి, దేవదాస్ క్రీడ ఉపాధ్యాయులు కృష్ణ, రాము తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment