విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేపట్టొద్దని ఆందోళన
మంచిర్యాలటౌన్: రామగుండంలోని ఎన్టీపీసీలో 2,400 మెగావాట్ల కొత్త ప్లాంట్ నిర్మాణం వల్ల మంచిర్యాల ప్రాంతంలో పర్యావరణం దెబ్బతింటుందని, నిర్మాణం చేపట్టొద్దని స్వచ్ఛంద పౌరసేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే మంచిర్యాల ప్రాంతంలో వాయు కాలుష్యంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని, కొత్తగా విద్యుత్ ప్లాంటుతో కాలుష్యం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో దాదాపుగా 20 కిలోమీటర్ల పరిధిలోనే ఏడు ఓపెన్‌కాస్టులు ఉన్నాయని, విద్యుత్ ప్లాంట్లు, సిరామిక్స్ పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. ఎన్టీపీసీలో మరో యూనిట్ కోసం ఈ నెల 28న ప్రభుత్వం చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణను ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త దహెగాం ఉమామహేశ్వర్‌రావు, స్వచ్ఛంద పౌరసేవ సంస్థ అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి తులా మధుసూదన్‌రావు, ఉపాధ్యక్షుడు, టీజేఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రదీప్, సంస్థ సభ్యులు రాధేశ్యాం, కై లాసం, తిరుపతి, రామచంద్రారెడ్డి, న్యాయవాదులు కర్రె లచ్చన్న, సందాని, అర్జున్, గణేశ్, నరేడ్డ శ్రీనివాస్, పందిళ్ల రంజిత్, దేవిసత్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment