జైపూర్: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్టీపీపీ నుంచి నలుగురు ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు. కె.అరుణ్(ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పర్చేస్), అజ్మీర మోహన్ ఉత్తమ సింగరేణియన్‌గా కొత్తగూడెంలో జరిగే వేడుకల్లో సింగరేణి సీఎండీ బలరాం చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. సీనియర్ స్టాఫ్ నర్స్ రాజమణి, కె.వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికయ్యారు. వీరు ఎస్టీపీపీలో నిర్వహించే వేడుకల్లో అవార్డులు అందుకుంటారు.
ఓటు ఎంతో విలువైంది
మంచిర్యాలఅగ్రికల్చర్: ఓటు ఎంతో విలువైందని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. శనివారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన వేడుకల్లో అదనపు కలెక్టర్ మోతీలాల్‌తో కలిసి పాల్గొన్నారు. వీడియో ద్వారా భారత ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్‌కుమార్ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, సిబ్బందితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. నూతనంగా ఓటు నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులు పంపిణీ చేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య
గుడిహత్నూర్(బోథ్): మనస్తాపంతో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన షేక్ హఫీజ్ (40) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఇంట్లో భార్య ఫౌజియాబేగంతో గొడవ జరగడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం అతని తల్లి నజీమా తలుపు తట్టినా లేవకపోవడంతో మరో కుమారుడు షేక్ ఫిరోజ్‌కు సమాచారం అందించగా అతను వచ్చి తలుపు గొళ్లెం తెరిచి చూడగా ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment