ప్రాణాలకు హెల్మెట్ రక్షణ
● రామగుండం సీపీ శ్రీనివాస్
మంచిర్యాలక్రైం: ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారి నుంచి కాపాడుకునేందుకు హెల్మెట్ ప్రాణాలకు రక్షణ కల్పిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం మంచిర్యాలలో హెల్మెట్ ర్యాలీ, ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ నిబంధనలు, ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు 150 మందికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. హెల్మెట్ల దాత ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎండీ అజీజ్, ట్రస్మా మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షుడు ఉస్మాన్ పాషా, ట్రస్మా మందమర్రి జనరల్ సెక్రెటరీ లతశ్రీ, మంచిర్యాల కళాశాలల అధ్యక్షుడు రమణలను సీపీ శ్రీనివాస్ శాలువాలతో సత్కరించారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, ట్రాఫిక్ ఏసీపీ జాడి నర్సింహులు, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ, పట్టణ సీఐ ప్రమోద్‌రావు, రూరల్ సీఐ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి
మంచిర్యాలక్రైం: నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సీపీ ఎం.శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ ఆవరణంలోని సమావేశ మందిరంలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ ప్రతీ కేసులో సాంకేతిక పరమైన పూర్తి స్థాయి ఆధారాలతో సమగ్ర విచారణ జరపాలని, నేరస్తులకు శిక్ష పడే విధంగా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు భాస్కర్, చేతన, రాజు, ఏసీపీలు ప్రకాశ్, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment