తండ్రిని చంపిన కేసులో ఇద్దరు మైనర్లు, యువకుడు అరెస్టు
● తల్లి సంతోషంగా ఉండాలని హత్యచేసిన కుమారుడు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్లు
జైపూర్(చెన్నూర్): తల్లి సంతోషంగా ఉండాలని తండ్రిని చంపిన తనయుడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శని వారం అసిస్టెంట్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇందారంకు చెందిన ఆవిడపు రాజయ్య (45) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతనికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు ఉన్నారు. రాజయ్య మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పదిరోజుల క్రితం ఇదే విషయంపై గొడవ జరగడంతో భార్యను కొట్టడంతో కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఎప్పటికై నా తన తండ్రితో తనకూ, తన తల్లికి ప్రాణహాని ఉందని, అతన్ని చంపేస్తే సంతోషంగా ఉండవచ్చని భావించాడు. తన స్నేహితులైన శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌లో ని వాసం ఉంటే జంపల్లి సందీప్, నర్వలో ని వాసం ఉండే మరో బా లుడితో కలిసి ఈ నెల 24న రాత్రి రాజయ్య ఉండే ఇంటికి వ చ్చారు. తలుపు కొట్టడంతో రాజయ్య నిద్రనుంచి లే చి తలుపు తీయగా వెంటనే గట్టిగా తోయడంతో మ ంచంపై పడిపోయాడు. వెంటనే అతని కుమారుడు చాతిపై కూర్చోగా వెంట వచ్చినవారు కాళ్లు, చేతులు పట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న కత్తితో కుమారుడు తండ్రి గొంతు కోశాడు. వెంటనే ఆటోలో ముగ్గురు కలిసి పారిపోయారు. హత్యకు వాడిన ఆటో, కత్తి, రెండు సెల్‌ఫోన్లు, బైక్‌లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో శ్రీరాంపూర్ ఇన్‌చార్జి సీఐ రవీందర్, స్థానిక ఎస్సై శ్రీధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment