బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీలకు ఇవ్వాలి
బెల్లంపల్లి: బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీలకు కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ స భ్యుడు కొయ్యల ఏమాజీ, మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి డిమాండ్ చేశారు. శని వారం బెల్లంపల్లిలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 3లక్షల వరకు దళిత ఓటర్లు ఉన్నారని అన్నారు. బెల్లంపల్లి, చెన్నూర్ నియోజకవర్గాలను ఎస్సీలకు రిజర్వు చేశారని గుర్తు చేశారు. అదీ కాక పెద్దపల్లి పార్లమెంట్ కూడా ఎస్సీలకే కట్టబెట్టారని వివరించారు. జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించడం సబబుగా ఉంటుంద ని పేర్కొన్నారు.సమావేశంలో బీజేపీ ఎస్సీ మో ర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ, జిల్లా అ ధ్యక్షుడు కోడి రమేష్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి, కార్యదర్శి నవీన్, సురేష్, బీజేపీ రాష్ట్ర కౌ న్సిల్ సభ్యుడు కేశవరెడ్డి, జిల్లాఅధికార ప్రతి నిధి శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
కొనసాగుతున్న పక్షుల సర్వే
జన్నారం: కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అ టవీ డివిజన్‌లో పక్షుల సర్వే కొనసాగుతోంది. డివిజన్‌లోని ఇందన్‌పల్లి, జన్నారం, తాళ్లపేట్ అటవీ రేంజ్‌లలో పక్షుల నిపుణులు, అటవీ అధికారులు వలంటీర్లు పక్షుల సర్వే చేస్తున్నారు. ఉదయం 6నుంచి 10గంటల వరకు, మధ్యాహ్నం 3నుంచి 6గంటల వరకు పక్షులను గుర్తిస్తున్నారు. జన్నారం, ఇందన్‌పల్లి రేంజ్ అధికారులు సుష్మారావు, కారం శ్రీనివా స్ సర్వేను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఏడు టీంలు, 28 మంది ఎక్కడికక్కడే సర్వే నిర్వహించారు. ఆదివారంతో డివిజన్‌లో సర్వే పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment