రైల్వే క్రికెట్ ట్రోఫీ విజేత బెల్లంపల్లి లోకోస్టార్
● రన్నరప్ కాజీపేట ఆర్‌పీఎఫ్ జట్టు ● ట్రోఫీని అందజేసిన ఏడీఆర్‌ఎం గోపాల్
కాజీపేటరూరల్: రైల్వే జనరల్ ఇన్‌స్టిట్యూట్ కమిటీ ఆధ్వర్యంలో కాజీపేట రైల్వే స్టేడియంలో 12 రోజు లపాటు జరిగిన 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ క్రికెట్ లీగ్ సికింద్రాబాద్ డివిజనల్ లెవెల్ టోర్నమెంట్‌లో బెల్లంపల్లి లోకోస్టార్ విజయం సాధించింది. కాజీ పేట ఆర్‌పీఎఫ్ జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బెల్లంపల్లి జట్టు 20 ఓవర్లకు 195 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన కాజీపేట ఆర్‌పీఎఫ్ జట్టు 20 ఓవర్లకు 180 పరుగులు చేసింది. విజేతలకు సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్(ఏడీఆర్‌ఎం) ఎం.గోపాల్ బహుమతులు అందజేశారు. అంతకుముందు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్ కె.శ్రీని వాస్ ప్రత్యేక అతిథిగా హాజరై బెల్లంపల్లి లోకోస్టార్–కాజీపేట ఆర్‌పీఎఫ్ జట్ల మధ్య టాస్‌వేసి పోటీని ప్రారంభించారు. ఇనిస్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే ఇనిస్టిట్యూట్ చైర్మన్ ఆర్.ప్రశాంత్‌కృష్ణసాయి, వైస్ చైర్మన్ ఎన్.వి.వెంకటకుమార్, రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ రవీందర్, జెడ్‌బ్ల్యూసీ మెంబర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment