పేదల కోసమే పథకాలు
● బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి/బెల్లంపల్లిరూరల్: పేదల ఉన్నతి కోసం ప్రభుత్వం కొత్తగా పథకాలను అమలు చేస్తోందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. గురువారం బెల్లంపల్లి మున్సిపాలిటీ 31, 33వ వార్డుల్లో, బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి గ్రా మాల్లో నిర్వహించిన గ్రామసభల్లో ఆయన మాట్లాడారు. అర్హులకు రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తు ప్ర క్రియ నిరంతరం కొనసాగుతుందని అన్నారు. అ నంతరం పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, బె ల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ కే.శ్రీనివాసరావు, చైర్‌పర్సన్ శ్వేత, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మండల ప్రత్యేక అధికారి సీహెచ్.దుర్గాప్రసాద్, తహసీల్దార్ జ్యోత్స్న, ఎంపీడీవో మహేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment