నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
కౌడిపల్లి(నర్సాపూర్): కౌడిపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతుల దృష్ట్యా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈఈ సాయికుమార్, లైన్‌మెన్ శివకుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్‌స్టేషన్ పరిధిలోని కౌడిపల్లి, దేవులపల్లి, మహమ్మద్‌నగర్, కన్నారం, సదాశివపల్లి, పాంపల్లి, ధర్మాసాగర్ గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
సాగు భూములకే
‘రైతు భరోసా’
రామాయంపేట(మెదక్)/నిజాంపేట: సాగుకు యోగ్యం కాని భూములను గుర్తించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి విన్సెంట్ వినయ్ తెలిపారు. శనివారం మండలంలోని శివ్వాయపల్లిలో సర్వే తీరును పరిశీలించి మాట్లాడారు. రెవెన్యూ, వ్యవసాయశాఖ సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాగుకు యోగ్యమైన భూ ములకు మాత్రమే రైతు భరోసా అందే అవకా శం ఉందని, ఈనెల 20 వరకు గ్రామాల్లో సర్వే కొనసాగుతుందని వివరించారు. ఆయనతో పాటు ఇన్‌చార్జి సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, రెవెన్యూ అధికారులు ఉన్నా రు. అలాగే నిజాంపేట మండలంలోని నగరంలో రైతు భరోసా సర్వేను పరిశీలించారు. ఈస ందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు.
మహాసభలకు తరలిరండి
మెదక్ కలెక్టరేట్: సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆపార్టీ జిల్లా కార్య దర్శి నర్సమ్మ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లేశం అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో సీపీఎం రాష్ట్ర మహాసభలు 4 రోజులపాటు జరుగనున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి కార్మికులు, రైతులు వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
విజ్ఞానంపైనే భవిష్యత్ ఆధారపడి ఉంటుంది
మెదక్ కలెక్టరేట్: భవిష్యత్ అంతా విజ్ఞానంపైనే ఆధారపడి ఉందని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నా రు. ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జరిగిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న విద్యార్థులను శనివారం అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపిక కావడం గర్వకారణమని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 21 నుంచి 25 వరకు పుదుచ్చేరిలో జరిగే దక్షిణ భారతస్థాయి ప్రదర్శనలో రాణించి జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఏఈఓ సుదర్శనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
బ్యాంకర్లు అప్రమత్తంగా
ఉండాలి: డీఎస్పీ వెంకట్‌రెడ్డి
తూప్రాన్: బ్యాంకుల్లో దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని డీఎస్పీ వెంకట్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయా బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందుకోసం ప్రతి బ్యాంకులో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అప్పుడే వినియోగదారులకు బ్యాంకుల పట్ల నమ్మకం పెరుగుతుందని వివరించారు. ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించాలని పలువురు కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment