వెలగని లైట్లు.. తప్పని పాట్లు
మెదక్ మున్సిపాలిటీ: అంతిమ సంస్కారాలకు అవస్థలు తప్పడం లేదు. వైకుంఠధామాల్లో కనీస వసతులు కానరావడం లేదు. మెదక్ పట్టణం నవాపేట్ వీధికి చెందిన యువకుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలను నవాపేట్ ఖబరిస్థాన్‌లో రాత్రి నిర్వహించారు. చిమ్మ చీకట్లు అలుముకోవడం.. లైట్లు వెలగకపోవడంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేశారు. అయినా పూర్తిస్థాయిలో వెలుగు రాకపోవడంతో మొబైల్ ఫోన్ టార్చిలైట్ల వెలుగులో అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇప్పటికై నా స్మశానవాటికల్లో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించాలని పలువురు కలెక్టర్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment