‘సీఈఐఆర్’ను సద్వినియోగం చేసుకోండి
మెదక్ మున్సిపాలిటీ: సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన పోలీస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హవేళిఘణాపూర్ మండలం హవేళిఘణాపూర్ మండలం ఔరంగబాద్‌కు చెందిన పెంటయ్య 2023 జూన్‌లో మొబైల్ పోగొట్టుకున్నాడని, అతడు వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా.. ఫోన్ నంబర్‌తో పాటు ఐఎంఈఐ నంబర్‌ను సీఈఐఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్లు తెలిపారు. వారం క్రితం యూపీలో ఫోన్ ఆన్ చేయడం చేయగా.. మొబైల్ దొరికిన వ్యకికి 94 బీఎంఎస్ ప్రకారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి నోటీసులు పంపామన్నారు. అతడు వెంటనే భయపడి కొరియర్ ద్వారా మొబైల్ పంపించాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment