Shraddha Arya Marriage Photos, Videos Goes Viral: హీరోయిన్ శ్రద్ధ ఆర్య వైవాహిక బంధంలో అడుగు పెట్టింది. బుధవారం(నవబంర్ 16న) నావికాదళ అధికారి రాహుల్ శర్మను వివాహమాడింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోల్లో నూతన వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఒక వీడియోలో అయితే నటి తనను ఎత్తుకోమని భర్తను అడగడంతో అక్కడున్నవారందరూ ఫక్కుమని నవ్వేశారు. ఇక ఈ పెళ్లి వేడుకకు 'కుండలీ భాగ్య' నటీనటులు అంజుమ్ ఫఖీ, సుప్రియ శుక్ల, 'బాలికా వధు' నటుడు శశాంక్ వ్యాస్ సహా తదితరులు అతిథులుగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
మూడు ముళ్లు, ఏడడుగులతో కొత్త జీవితాన్ని ప్రాంభించిన నవ వధువు శ్రద్ధ కూడా తన భర్తతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ మురిసిపోతోంది. కాగా శ్రద్ధకు గతంలో ఓ ఎన్నారైతో నిశ్చితార్థం జరిగింది. వీరిద్దరూ నాచ్ బలియే 9వ సీజన్‌లోనూ పాల్గొన్నారు. కానీ ఈ సీజన్ ముగిసే సమయానికి వీళ్లు తాము పెళ్లి చేసుకోవట్లేదని ప్రకటించారు.
శ్రద్ధ కెరీర్ విషయానికి వస్తే తెలుగులో గొడవ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఇందులో వైభవ్ రెడ్డి హీరో. వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా అడుగు పెట్టిన శ్రద్ధ కుండలీ భాగ్య సీరియల్‌తో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. మే లక్ష్మీ తేరే అంగాన్ కీ, తుమ్హారీ పాఖీ, డ్రీమ్ గర్ల్ వంటి ధారావాహికల్లోనూ తళుక్కున మెరిసింది.
Comments
Please login to add a commentAdd a comment