Allu Arjun Pushpa 2: The Rule Artists Injured In Bus Accident At Narketpally, Video Viral - Sakshi
Sakshi News home page

Pushpa 2: ఘోర రోడ్డు ప్రమాదం.. ‘పుష్ప 2’ ఆర్టిస్టులకు తీవ్ర గాయాలు!

Published Wed, May 31 2023 8:24 AM | Last Updated on Wed, May 31 2023 10:24 AM

Allu Arjun Pushpa 2 Artists Injured In Road Accident - Sakshi

అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆర్టిస్టుల బస్సు  ప్రమాదానికి గురైంది. నార్కట్‌పల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టిస్టులు వెళ్తున్న బస్సును మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. షూటింగ్‌ ముగించుకొని వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్‌-అల్లు అర్జున్‌ కాంబోలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రమిది. రెండేళ్ల క్రితం విడుదలైన పుష్ప చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మారేడు మిల్లి లో  జరుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement