Kangana Ranaut Says 'No Bollywood Star Deserves to Come To My Home' - Sakshi
Sakshi News home page

Kangana Ranaut: వాళ్లకు నా ఇంటికి వచ్చే అర్హత లేదు: కంగనా ఫైర్‌

Published Wed, May 18 2022 12:00 PM | Last Updated on Wed, May 18 2022 12:57 PM

Kangana Ranaut: No Bollywood Star Deserves to Come To My Home - Sakshi

ఉన్నది ఉన్నట్లుగా, ముక్కుసూటిగా మాట్లాడే సెలబ్రిటీల్లో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ముందు వరుసలో ఉంటారు. బాలీవుడ్‌ స్టార్లపై విమర్శలు చేసే ఆమె తాజాగా మరోసారి వారి మీద విరుచుకుపడింది. ఏ స్టార్‌కి కూడా తన ఇంటికి వచ్చే అర్హత లేదని తేల్చి చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో నాకంటూ ఎవరూ ఫ్రెండ్స్‌ లేరు. నా ఇంటికి వచ్చే అర్హత ఎవరికీ లేదు. కావాలంటే వారిని బయట కలుసుకుని మాట్లాడొచ్చు, అంతే తప్ప ఎవరినీ నా ఇంటికి ఆహ్వానించను' అని చెప్పుకొచ్చింది.

కాగా కంగనా ఇటీవలే అజయ్‌ దేవ్‌గణ్‌పై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే! అజయ్‌ దేవ్‌గణ్‌ అందరి సినిమాలను ప్రమోట్‌ చేస్తాడు, కానీ నా మూవీని మాత్రం ఎప్పుడూ ప్రమోట్‌ చేయలేదు.  నన్ను పిలిచి తలైవి సినిమా బాగుందని చెప్పాడు, కానీ దాని గురించి ఒక్క ట్వీట్‌ కూడా చేయలేదు అని ఆగ్రహించింది. ఇదిలా ఉంటే కంగనా నటించిన ధాకడ్‌ సినిమా మే 20 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి👇

నన్ను బతికించారు.. నా బతుకుదెరువుని కూడా బతికించండి

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే, అసలైన పోటీ ఆ ఇద్దరి మధ్యే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement