బట్టలు విప్పటానికి మాల్దీవులకెళ్లాలా? | Karanvir Bohra Poses In Underpants Instagram Post Gone Viral | Sakshi
Sakshi News home page

బట్టలు విప్పటానికి మాల్దీవులకెళ్లాలా?

Published Thu, Dec 17 2020 4:01 PM | Last Updated on Thu, Dec 17 2020 6:35 PM

Karanvir Bohra Poses In Underpants Instagram Post Gone Viral - Sakshi

బోహ్రా ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోలు

న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్‌ టీవీ నటుడు కరణ్‌వీర్‌ బోహ్రా మరోసారి తన అభిమానులతో పాటు నెటిజన్లను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తారు. అయితే అది నటనతో కాదు అర్థనగ్నంగా దిగిన తన ఫొటోలతో. అండర్‌ వేర్‌, షార్ట్‌తో బాత్‌రూంలో దిగిన ఆ ఫొటోలను బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘‘ బట్టలు విప్పటానికి నేను మాల్దీవులు వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా మంది అడుగుతుంటారు. ఓ నటుడిగా మీకు మంచి బాడీ ఉండాలి కదా.. సిక్స్‌ ప్యాక్స్‌ ఎందుకు లేవు.. కండలు తిరిగిన దేహం ఎందుకు లేదని. అందుకే ఇలా నా బాడీని చూపిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. బాడీని ఓ షేపులో ఉంచుకోవటానికి ఏం చేయాలో వివరించారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 32వేల లైకులు, వందల కొద్ది కామెంట్లు సొంతం చేసుకుంది.

చదవండి : హృతిక్‌ విచార గాధ మళ్లీ మొదలైంది: కంగనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement