సమంత జనాల్ని పిచ్చోళ్లను చేస్తోంది... డాక్టర్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

తెలీకపోతే నోరు మూసుకోవాలి కానీ.. మరీ ఇలా మాట్లాడతారా? సామ్‌పై డాక్టర్‌ ఫైర్‌

Published Thu, Mar 14 2024 6:56 PM

The Liver Doctor Says Samantha Misinforming 33 Million People - Sakshi

తెలిస్తే తెలుసని చెప్పాలి.. లేదంటే తెలియదని నోరుమూసుకోవాలి. అంతేకానీ నోటికొచ్చింది చెప్పి అదే నిజమని జనాల్ని పిచ్చోళ్లను చేయడం కరెక్ట్‌ కాదు అంటున్నాడో డాక్టర్‌. ఆయన అంటుంది హీరోయిన్‌ సమంత గురించే! ఇటీవల సామ్‌ ఓ పాడ్‌కాస్ట్‌లో శరీరంలోని కాలేయాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలో చెప్పుకొచ్చింది. అది చూసి మండిపోయిన ఓ డాక్టర్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఆమెను ఏకిపారేశాడు.

తప్పుదోవ పట్టిస్తోంది
'లివర్‌ డీటాక్సింగ్‌ (కాలేయాన్ని శుద్ధి చేయడం ఎలా?) అనే అంశంపై సమంత తన 33 మంది మిలియన్ల ఫాలోవర్లను తప్పుదోవ పట్టించింది. ఈ పాడ్‌కాస్ట్‌లో అసలేమీ తెలియని న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కోచ్‌లను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. వారికి మానవ శరీరం ఎలా పని చేస్తుందో కూడా తెలీదు. రోగనిరోధకశక్తి తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధులను కొన్ని మూలికల ద్వారా నయం చేయవచ్చని ఏదేదో వాగుతున్నారు. 

ఏమీ తెలియని అజ్ఞాని
కేవలం గొప్ప ఫాలోయింగ్‌ ఉంటే చాలు.. ఆరోగ్యం గురించి, ఔషధాల గురించి ఏమీ తెలియకపోయినా సరే ఆ సెలబ్రిటీలను తీసుకొచ్చి హెల్త్‌ పాడ్‌కాస్ట్‌ చేయిస్తున్నారు. సైన్స్‌ గురించి ఏమీ తెలియని ఇద్దరు వ్యక్తులు వారి అజ్ఞానాన్ని పంచుకుంటున్నారు. వెల్‌నెస్‌ కోచ్‌ అని చెప్పుకుంటున్న వ్యక్తికి మెడికల్‌ విభాగంలో కనీస అవగాహన లేదు. అసలు కాలేయం ఎలాంటి పనులు నిర్వర్తిస్తుందో కూడా తెలియదు. డాండెలియన్‌ అనే మొక్క లివర్‌ ఆరోగ్యాన్ని పెంచుతుందని చెప్తున్నాడు.

అదేంటో తెలుసా?
దశాబ్దకాలంగా కాలేయరోగులకు చికిత్స అందిస్తున్న రిజిస్టర్‌ హెపటాలజిస్ట్‌ అయిన నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. డండేలియన్‌ అనేది చాలామంది ఒక కలుపు మొక్కగానే భావిస్తారు. కొందరు దీన్ని సలాడ్‌గా కూడా వాడతారు. దీన్ని తీసుకోవడం వల్ల యూరిన్‌ ఎక్కువ వస్తుంటుంది. కలుపు మందుల వాడకం వల్ల దీన్ని ఎవరూ వాడొద్దని చెప్తుంటారు. డండేలియన్‌ను పందులు, ఎలుకలు వంటి జంతువులపై ప్రయోగించారు. కానీ మానవులపై కాదు..' అంటూ ఆ మొక్క గురించి క్షుణ్ణంగా రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: ఇంట్లో సింపుల్‌గా మౌనిక సీమంతం.. వెన్నంటే మనోజ్‌..

Advertisement
Advertisement