నీలాంటివాడ్నే..! | Ram Charan Game Changer 2nd Lyrical Video Release | Sakshi
Sakshi News home page

నీలాంటివాడ్నే..!

Published Tue, Oct 1 2024 12:02 AM | Last Updated on Tue, Oct 1 2024 12:03 AM

Ram Charan Game Changer 2nd Lyrical Video Release

‘‘కళ్లజోడు తీస్తే నీలాంటివాడ్నే.. షర్ట్‌పైకి పెడితే నీలాంటివాడ్నే... టక్కు టై తీస్తే నీలాంటివాడ్నే...’ అంటూ మొదలవుతుంది ‘గేమ్‌   చేంజర్‌’ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌. హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘గేమ్‌చేంజర్‌’. కియారా అద్వానీ హీరోయిన్ . అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్‌’ రాజు ప్రోడక్షన్స్పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ క్రిస్మస్‌కి విడుదల కానుంది.

తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘రా మచ్చా మచ్చా..’ పాట లిరికల్‌ వీడియోను సోమవారం సెయింట్‌ మార్టిన్స్‌ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో రిలీజ్‌ చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ పాటను అజీజ్‌ పాడగా, తెలుగు వెర్షన్ కు అనంత శ్రీరామ్, తమిళంలో వివేక్, హిందీలో కుమార్‌ లిరిక్స్‌ రాశారు. గణేష్‌ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. ‘రా మచ్చా మచ్చా..’ పాట విడుదల కార్యక్రమంలో ‘దిల్‌’ రాజు, శంకర్, నటులు శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, తమన్, అనంత శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్‌ బెంగాల్, జార్ఖండ్‌ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు ఈ పాటలో భాగమయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement