మోత మోగిపోతాయి! | Ram Charan Game Changer Release Date Fixed | Sakshi
Sakshi News home page

మోత మోగిపోతాయి!

Published Fri, Sep 20 2024 4:29 AM | Last Updated on Fri, Sep 20 2024 4:29 AM

Ram Charan Game Changer Release Date Fixed

హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గేమ్‌ చేంజర్‌’. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల ఓ సందర్భంలో ఈ సినిమాను క్రిస్మస్‌ సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు ‘దిల్‌’ రాజు పేర్కొన్నారు. అయితే రిలీజ్‌ డేట్‌ను మాత్రం ఆ సమయంలో చెప్పలేదు. కాగా ఈ సినిమా గురించిన తాజా అప్‌డేట్‌ను ఈ చిత్రం మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేశారు. ‘గేమ్‌ చేంజర్‌’ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వర్క్‌ అక్టోబరు 1న ఆరంభిస్తాం. డిసెంబరు 20, 2024లో థియేటర్స్‌ మోత మోగిపోతాయని (బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆ రేంజ్‌లో ఉంటుందని పరోక్షంగా చెబుతున్నట్లు కావొచ్చు) తమన్‌ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. 

పెద్దికి తంగలాన్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ 
రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతదర్శకుడు. ‘తంగలాన్‌’ సినిమాకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేసిన ఏకాంబరంను ఈ చిత్రానికి డిజైనర్‌గా తీసుకున్నారు బుచ్చిబాబు. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై వెంకట సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement