‘ముందురోజు సుశాంత్‌ బెడ్‌రూంలో నలుగురు వ్యక్తులు’ | Sushant Singh Death: Locksmith Reveals What Happened On June 14 | Sakshi
Sakshi News home page

‘ఆ రోజు సుశాంత్‌ బెడ్‌రూం తాళం నేనే పగలగొట్టాను’

Published Sat, Aug 22 2020 3:27 PM | Last Updated on Sat, Aug 22 2020 4:12 PM

Sushant Singh Death: Locksmith Reveals What Happened On June 14 - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టినప్పటి నుంచి ఈ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి.  ఎన్నో కీలక అంశాలు ఒక్కొట్టిగా బట్టబయలవుతున్నాయి. ఇక తాజాగా సుశాంత్‌ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. సుశాంత్‌ ఆత్మహత్యకు(జూన్‌ 14) ముందు రోజు సుశాంత్‌ బెడ్‌రూం లాక్‌ను తానే పగలగొట్టానంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని లాక్‌స్మిత్(తాళలు మరమ్మత్తు చేసేశాడు) మహ్మద్‌ రఫీ షేక్‌ చెప్పిన విషయాలు పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.  అతడు చెప్పిన విషయాలను చూస్తుంటే సుశాంత్‌ది నిజంగా ఆత్మహత్యేనా? అనే  సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్‌ రఫీ ఆ ముందు రోజు జరిగిన విషయాలను ఇలా క్లుప్తంగా వెల్లడించాడు.

చదవండి: సుశాంత్‌కు ఆ అల‌వాటే లేదు.. కానీ

ఒక ఇంటర్వ్యూలో మహ్మద్‌ రఫీ మాట్లాడుతూ.. ‘సుశాంత్‌ ఆత్మహత్యకు ముందు రోజు మధ్యాహ్నం​ 1:30 ప్రాంతంలో గది తాళం పగలగొట్టాలని నాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది. దీంతో నేను వారు చెప్పిన అడ్రస్‌కు వెళ్లి అపార్టుమెంట్‌లోని 6వ అంతస్తులో ఉన్న డూప్లెక్స్‌ ఫ్లాట్‌కు వెళ్లాను. అక్కడి బెడ్‌రూం తాళంను సుత్తి, కత్తితో పగలగొట్టాను. ఆ గది తాళం కంప్యూటరైజ్‌ లాక్‌. దానిని పగలగొట్టినందుకు నాకు రూ.2 వేలు ఇచ్చారు’ అని అతడు చెప్పాడు. 
(చదవండి: సుశాంత్‌ ఇంటి పనిమనిషిని విచారిస్తున్న సీబీఐ)

రిపోర్టర్‌: నువ్వు తలుపు తెరిచాక లోపల శవం కానీ ఏమైనా చుశావా:
లాక్‌స్మిత్‌: బెడ్‌రూం తాళం తెరిచాక నేను ఏమి చూడలేదు. లోపలు ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు ఉన్నారు. వారు నన్ను ఏమి చూడనివ్వలేదు. వారు ఎవరో.. వారి పేర్లు కూడా నాకు తెలియదు. డోర్‌ తెరుచుకున్న వెంటనే వారు నాకు డబ్బులు ఇచ్చి.. నా సామన్లు తీసుకుని వెంటనే వెళ్లిపోవాలని సదరు వ్యక్తులు నాకు చెప్పారు. 

రిపోర్టర్‌: ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నారా?
లాక్‌స్మిత్‌: అక్కడ పోలీసులు ఎవరూ లేరు. కనీసం చూట్టు పక్కల కూడా లేరు. పోలీసుల హాజరు లేకుండానే తాళం తెరిచాను.

రిపోర్టర్‌: లోపల ఉన్న వ్యక్తులు భయంతో కానీ ఆందోళనతో కానీ ఉన్నట్లు మీకు అనిపించిందా?
లాక్‌స్మిత్‌: లేదు. వారు ఎలాంటి ఆందోళనతో కానీ భయపడుతున్నట్లుగా  కానీ అనిపించలేదు. వారు సాధారణంగానే ఉన్నారు. 

రిపోర్టర్‌: ఆ గదిలో ఏదైన మృతదేహాన్ని చుశారా? 
లాక్‌స్మిత్‌: లోపల ఏం ఉందో కూడా నాకు తెలియదు. వారు అసలు నన్ను ఏమి చూడనివ్వలేదు. వారిలో మాత్రం ఎలాంటి ఆందోళన లేదు. చాలా నార్మల్‌గా కనిపించారు. అయితే నన్ను ఆ గది నుంచి కాస్తా దూరం ఉంచి డబ్బులు ఇచ్చి నన్ను తిరిగి పంపించేశారు.

రిపోర్టర్‌: మీరు అక్కడికి రెండుసార్లు వెళ్లారు కదా? మొదటి సారి వెళ్లినప్పుడు అది సుశాంత్‌ ఇల్లు అని మీకు తెలుసా?
లాక్‌స్మిత్‌: అవును రెండు సార్లు వెళ్లాను. నేను తాళం పగలగొట్టి వచ్చాక పోలీసులు మళ్లీ నాకు ఫోన్‌ చేసి రమ్మన్నారు. అయితే మొదటిసారి వెళ్లినప్పుడు అది సుశాంత్‌ ఇల్లు అని నాకు తెలియదు. రెండవసారి పోలీసులు పిలిచాక అప్పుడు తెలిసింది అది సుశాంత్‌ ఇల్లు అని  చెప్పుకొచ్చాడు.

చదవండి: రియా, మహేష్‌ భట్‌ల వాట్సాప్‌ చాట్‌ వైరల్

చివరగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసిందని,  ఈ కేసులో తాను సీబీఐకి సహకరిస్తానని రఫీ పేర్కొన్నాడు. అయితే అధికారుల దగ్గరి నుంచి తనకు ఎలాంటీ పిలుపు రాలేదన్నాడు. ఒకవేళ సీబీఐ కాల్‌ చేస్తా వారికి సహకరిస్తానని చెప్పాడు. ఇప్పటికే ఈ కేసులో ముంబై పోలీసలు పిలిస్తే నాకు తెలిసింది చెప్పానని అతడు తెలిపాడు. జూన్‌ 14న సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ముంబై పోలీసులు సుశాంత్‌ది ఆత్మహత్యగా ధృవీకరించి ప్రకటించిన అనంతరం అతడి తండ్రి కేకే సింగ్‌ పాట్నా పోలీసు స్టేషన్‌లో రియాపై కేసు నమోదు చేశాడు. ఇక బిహార్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ కేసును సుప్రీం కోర్టు సీబీఐకి  అప్పగించిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement