యూనియన్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఐఎన్‌టీయూసీ నాయకులు
భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు రావా ల్సిన 11వ వేజ్‌బోర్డు ఎరియర్స్ ఒకే విడత చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భూపాలపల్లి ఏరియాలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, సింగరేణి ఉద్యోగుల సంఘం కార్మిక సంఘాల నాయకులు వేర్వేరుగా నిరసన గళం వినిపించారు.
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో..
సింగరేణి కార్మికులకు రావాల్సిన 23 నెలల ఎరి యార్స్‌ను కోలిండియా యాజమాన్యం మాదిరిగా ఒకే విడత చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ మాట్లాడారు. కోల్ ఇండియా యాజమాన్యం అక్కడి కార్మికులకు ఒకే దఫా 23 నెలల ఎరియర్స్ చెల్లిస్తుందని తెలిపారు. సింగరేణి యాజమాన్యం మాత్రం రెండు విడుతలుగా చెల్లించేందుకు ఆలోచన చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు తేదీలను కూడా ప్రకటించకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఈ నెలలోనే కార్మికుల రావాల్సిన బకాయిల మొత్తం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, యూనియన్ నాయకులు మాతంగి రామచందర్, శ్రీనివాస్, విజేందర్, కృష్ణమూర్తి, నారాయణ, పొషం, గణేష్, రమేష్, కరీముల్లా పాల్గొన్నారు.
ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో..
వేజ్‌బోర్డ్ ఎరియర్స్ చెల్లింపుపై యాజమాన్యం అయోమయ గందరగోళ వైఖరి వీడాలని డిమాండ్ చేస్తూ ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో స్థానిక బ్రాంచ్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్ మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికుల పట్ల మొండి వైఖరి అవలంభిస్తోందన్నారు. కార్మికులకు చెల్లించే ఎరియర్స్‌పై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వడం లేదన్నారు. కార్మికులకు రావాల్సిన లాభాల వాటా ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందని ఆరోపించారు. విద్యుత్ సంస్థల నుంచి యాజమాన్యానికి రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. సింగరేణి సీఎస్‌ఆర్, డీఎంఎఫ్‌టీ నిధులతో భూపాలపల్లి ప్రాంతంలోని సింగరేణి ప్రభావిత గ్రామాలలో అభివృద్ధి పనులు చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఈ ప్రాంతాన్ని అన్యాయానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘుపతిరెడ్డి, వేణుగోపాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment