కనులపండువగా..
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం గోదాదేవి రంగనాదుల కల్యాణాన్ని కనులపండువగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఎల్లాప్రగడ నాగేశ్వరరావు శర్మ, వేద పండితులు మణికంఠ శర్మ, కృత్తిక శర్మ కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ధనుర్మాసంలో గోదారంగనాథుల కల్యాణం జరిపించడం శుభప్రదమైందని వెల్లడించారు. అష్టోత్రనామ పూజలు, తిరుప్పావై మంత్ర ప్రశస్తను జరిపించారు. మాంగళ్యధారణ ముహూర్తానికి గోదారంగనాథుల కల్యాణం జరిపించారు. దేవతామూర్తులకు తలంబ్రాలను పోసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు కల్యాణ వేడుకలను తిలకించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి శేషవస్త్రాలను లక్ష్మీనర్సింహారావుకు, ప్రదీప్‌రావుకు అర్చకులు నాగేశ్వరరావుశర్మ బహూకరించారు. ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకులమర్రి భాస్కర్‌రావు, మేర్గు వెంకటేశ్వర్లు, అల్లి శ్రీనివాస్, ఆలయ చైర్మన్ అలువాల శ్రీనివాస్, తాటి కృష్ణ, తాడూరి రఘు, కోశాధికారి ధీనబాంధువస్వామి, ప్రధాన కార్యదర్శి కత్తెర శ్రీనివాస్, బాల్య ప్రసాద్, పెండ్యాల సంతోష్‌తో పాటు కమిటీ సభ్యులు సిద్దు, శశీధర్ తదితరులు పాల్గొన్నారు.
గోదారంగనాథుల కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment