వనదేవతలకు మొక్కులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద ఉన్న షెవర్ల కింద పుణ్యస్నానాలు ఆచరించి కల్యాణకట్టలో పుట్టు వెంట్రుకలను సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చిరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భోగి పండుగను పురస్కరించుకుని సమ్మక్క– సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు పూజారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు.
కొనసాగుతున్న
క్రీడాపోటీలు
ములుగు: ములుగు మండల పరిధిలోని చిన్న గుంటూరుపల్లిలో అభ్యుదయ రైతుసంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న క్రీడాపోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం కబడ్డీ, వాలీబాల్, తాడు గుంజడం, మ్యూజికల్ చైర్ వంటి క్రీడాపోటీలను నిర్వహించారు. క్రీడాకారులకు నిర్వహణ కమిటీ తరఫున తగిన సూచనలు, సలహాలు అందించారు. నేడు మహిళలకు ముగ్గుల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవిరెడ్డి అంజిరెడ్డి, ముక్కు సుబ్బారెడ్డి, పైడిపల్లి కుమారస్వామి, సానికొమ్ము శ్రీనివాస్ రెడ్డి, నర్సిరెడ్డి, ఆదిరెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవాదాయశాఖ
పనులు షురూ..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో మినీ జాతర పనులు మొదలయ్యాయి. ఫిబ్రవరి 12నుంచి 15వ తేదీ వరకు మినీ మేడారం జాతర జరగనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం మేడారం దేవాదాయశాఖ అధికారులు సోమవారం పనులను ప్రారంభించారు. గద్దెల ప్రాంగణంలో భక్తులు కొబ్బరికాయలు కొట్టి ఐరన్ స్టాండ్‌ల వెల్డింగ్ మరమ్మతుల పనులను చేపట్టారు. మినీ జాతరకు ముందస్తుగా వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికారులు ఆలయంలో మరమ్మతుల పనులను చేపట్టారు. అమ్మవార్ల గద్దెల చుట్టూ గ్రిల్స్‌ను మరింత ఎత్తు పెంచి హంగిలర్లు ఏర్పాటు చేసేందుకు గతేడాది దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రూ.20లక్షలతో టెండర్ నిర్వహించారు. ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌తో మళ్లీ వచ్చే మహాజాతర వరకు హంగిలర్లు ఏర్పాటు చేయనున్నారు. హంగిలర్ల ఏర్పాటుతో భక్తులు గద్దెలపై బెల్లం, కొబ్బరి వేసిరితే దెబ్బలు తలగకుండా ఉంటుంది. ఈ పనులు పొందిన కాంట్రాక్టర్ వెల్డింగ్ మరమ్మతు పనులు ప్రారంభించినట్లు దేవాదాయశాఖ ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
హైకోర్టు జడ్జి పూజలు
కాళేశ్వరం: శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని హైకోర్టు జడ్జి రాధరాణి దంపతులు సోమవారం దర్శించుకున్నారు. జడ్జి దంపతులు ఆలయ రాజగోపురం వద్దకు చేరుకోగా ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు మంగళవాయిద్యాలు, మంత్రోచ్చరణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో ద్విలింగాలకు అభిషేక పూజలు నిర్వహించారు. శ్రీశుభానందదేవి అమ్మవారికి పూజలు చేశారు. ఆశీర్వచన వేదిక వద్ద సూపరింటెండెంట్ శ్రీనివాస్ వారిని శేషవస్త్రాలతో సన్మానించారు. అర్చకులు వారిని ఆఽశీర్వదించి, తీర్థప్రసాదం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment