సంక్రాంతి వస్తే ఆంధ్రాలోనే..
చిన్నప్పటి నుంచి సంక్రాంతి పండుగ వస్తే చాలు మా ఇళ్లంతా సందడే. వారం రోజుల నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధం అవుతాం. మా అక్క, బావలు రాజమండ్రిలో ఉంటారు. అక్కడ గోదావరి ఒడ్డున పండుగ జరుపుకుంటే ఆ సంతోషమే వేరు. మా అక్కా, బావలను బతుకమ్మ పండగకు మా ఇంటికి పిలుస్తా.. వారు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు.
– రేసు స్పందన, మహబూబాబాద్
పదేళ్ల నుంచి వెళ్తున్నా..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గడిచిన పదేళ్లుగా భీమవరం వెళ్తున్నం. ఇంటి వద్ద భోగి పండుగ చేసుకుని.. మిత్ర బృందంతో కలిసి సంక్రాంతి పండుగ రోజు భీమవరంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటాం. గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి.. కోడిపందెల్లో పాల్గొంటాం. అక్కడ జరిగే సంక్రాంతి సంబురాలు చూస్తాం.
– మల్లిగారి రాజు, జనగామ, అంబేడ్కర్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment