రామప్పను సందర్శించిన ప్రముఖులు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని కార్తీక పౌర్ణమి సందర్భంగా పలువురు ప్రముఖులు సందర్శించారు. అటవీశాఖ పీసీసీఎఫ్ సునితభగవత్, కేంద్ర సీ్త్ర శిశు సంక్షేమ ఆదనపు కార్యదర్శి జ్ఞానేశ్ భర్తీ, జిల్లా వ్యవసాయ అధికారి తేజోవతి వేర్వేరుగా రామప్ప ఆలయాన్ని సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు చేశారు. టూరిజం గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్ వారికి ఆలయ విశిష్టతను వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని కొనియాడారు.
సమస్యలు పరిష్కరించాలి
ములుగు: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాల్గొ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుగులోత్ రమేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాకు వినతిపత్రం అందించారు. ఉద్యోగులకు దుస్తులు అందించాలని, ఔట్‌సోరింగ్ ఉద్యోగులకు, కాంటిజెంట్ వర్కర్లకు నెలవారీ వేతనం అందేలా చూడాలని కోరారు. సమస్యలపై పీఓ సానుకూలంగా స్పందించినట్లు రమేశ్ తెలిపారు.
నేడు విద్యుత్ అంతరాయం
ములుగు రూరల్: విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ డీఈ సదానందం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేడు(శనివారం) ఉదయం 09 గంటల నుంచి 12 గంటల వరకు 33/11 కేవీ ఉపకేంద్రాల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ములుగు, పత్తిపల్లి, అబ్బాపూర్, పందికుంట, పసర, కర్లపల్లి, నర్సాపూర్, తాడ్వాయి, కాటాపూర్, ఏటూరునాగారం, రాజుపేట, ఏటూర్, అలుబాక సబ్ స్టేషన్ల పరిధిలో అంతరాయం ఉంటుందని అన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
‘గోర్ మళావో’ను
విజయవంతం చేయాలి
ములుగు: ఈ నెల 24, 25వ తేదీల్లో సంగారెడ్డి జిల్లా గుడితండాలో నిర్వహించనున్న గోర్ మళావో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సేవాలాల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పోరిక సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. గిరిజన బంజార బిడ్డలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు జిల్లాకేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ శుక్రవారం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. ఏక్‌వాత్, ఏక్ జాత్, ఏక్‌సాత్ నినాదంతో కులదైవాలు మేరమ్మయాడి, సేవాలాల్ మహరాజ్ చూపిన బాటలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, బోడ కిషన్‌నాయక్, పోరిక రాహుల్‌నాయక్, పాల్తీయ సారయ్య, పోరిక రాజ్‌కుమార్, పోరిక శ్యామెల్‌నాయక్, వినయ్, భూక్య రాజు, సంతోశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు ఉత్పత్తి
లక్ష్యసాధనకు కృషి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని కార్పొరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ విభాగం జీఎం మనోహర్ తెలిపారు. ఏరియాలో టార్గెట్ కమిటీ శుక్రవారం పర్యటించింది. ఈ సందర్భంగా ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి బొగ్గు ఉత్పత్తి, వచ్చే ఏడాది సాధించాల్సిన లక్ష్యంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు అందరూ సమష్టిగా కృషిచేయాలని సూచించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యం, ప్రణాళికలు, బొగ్గు ఉత్పత్తి, ఓబీ రవాణా అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, వెంకటరామరెడ్డి, భిక్షమయ్య, జోతి, రవికుమార్, మారుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment