కోతలేకుండా దిగుమతి చేసుకోవాలి
ములుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం ఎఫ్‌ఏక్యూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో చూసుకున్న తర్వాత కోతలు లేకుండా దిగుమతి చేసుకోవాలని పౌరసరఫరాల సంయుక్త కమిషనర్ మోహన్‌కుమార్ రాథోడ్ సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్(రెవెన్యూ) సీహెచ్.మహేందర్‌జీ అధ్యక్షతన మిల్లర్లతో జరిగిన సమావేశంలో సహాయ కమిషనర్ వెంకటేశ్వర్‌రావుతో కలిసి ఆయన మాట్లాడారు. మిల్లర్లు అవకతవకలకు పాల్ప డితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ డీఎం రాంపతి, డీసీఎస్‌ఓ ఫైజల్‌హుస్సేన్, డీసీఓ సర్దార్‌సింగ్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment