ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి
ములుగు: ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ టీఎస్ దివాకర ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు సీహెచ్.మహేందర్‌జీ, సంపత్‌రావుతో కలిసి ప్రజల నుంచి 31 దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ గోపాల్‌రావు, సీపీఓ ప్రకాశ్, ఐటీడీఏ డీడీ పోచం, డీసీఓ సర్దార్‌సింగ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తుల రవి, డీఈఓ పాణిని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment