వచ్చే ఏడాది నుంచి దిగుబడి ప్రారంభం
ములుగు : వచ్చే ఏడాది నుంచి జిల్లాలో ఆయిల్‌పామ్ దిగుబడి ప్రారంభమవుతుందని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి అనసూయ అన్నారు. శుక్రవారం ములుగు మండలం ప్రేమ్‌నగర్ సమీపంలో కూన గణపతిరావు, గోవిందరావుపేట మండలం చల్వాయి సమీపంలో బండమీద కుమారస్వామి ఆయిల్‌పామ్ తోటలో కేఎన్ బయోసైన్సెస్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫలదీకరణ కీటకాలను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 2400 ఎకరాల్లో పంట సాగు అవుతుందని తెలిపారు. మొక్క నాటిన 36 నెలల తరువాత మొక్కకు వచ్చే పోగుత్తులను తొలగించకుండా చెట్టుపైనే ఉంచాలని సూచించారు. ఫలదీకరణకు ఏడోబిస్ కామేరునిక కీటకాన్ని విడుదల చేస్తే పంట దిగుబడి ఆశించిన మేర వస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు శ్రీకాంత్, లావణ్య, మైక్రో ఇంజనీర్ వినోద్, కేఎన్ బయోసైన్సెస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హేమంత్, నవీన్, రంజిత్, సురేష్, శివకృష్ణ, మహిపాల్ రైతులు గణపతిరావు, అశోక్, రాజిరెడ్డి, రమేష్ పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ
అధికారి అనసూయ
Comments
Please login to add a commentAdd a comment