వైద్యులు సమయపాలన పాటించాలి
ములుగు రూరల్ : వైద్యులు, వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని రాయినిగూడెం పీహెచ్‌సీ, జంగాలపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో మందుల నిల్వ గదిని, నిల్వ ఉన్న మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యంకోసం వచ్చిన రోగులను పీహెచ్‌సీలో అందుతున్న వైద్యంపై అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసేవల కోసం వచ్చిన రోగులతో మర్యాదగా వ్యవహరించాలని అన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను 100 శాతం లక్ష్యాలను సాధించాలని అన్నారు. విధులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యులు నవ్యరాణి, నాగఅన్వేష్, శ్రవణ్, సీనియర్ అసిస్టెంట్ అన్నపూర్ణ, సూపర్‌వైజర్లు నిర్మల మేరి, స్టాఫ్ నర్సు సత్యకుమారి పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment