రాత పరీక్ష లేకుండా పర్మనెంట్ చేయాలి
ములుగు రూరల్ : రాతపరీక్ష లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండో ఏఎన్‌ఎంలను పర్మనెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. శుక్రవారం రెండో ఏఎన్‌ఎంలు చేపడుతున్న నిరవధిక దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. అనంతరం జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంల క్రమబద్ధీకరణ కోసం త్రిసభ్య కమిటీ వేసిందని అప్పటి నుంచి ఏఎన్‌ఎంలతో ఎలాంటి చర్చలు జరుపలేదని, నివేదికలు ప్రభుత్వానికి అందించలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రాత పరీక్షలను రద్దు చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు జమునరాణి, మంజుల, పావని, సుజాత, సూర్యకాంతమ్మ, అరుణ, సీత, సునీత, గీత, సోమలక్ష్మీ, అనురాధ, శాంత, కౌసల్య, తిరుమల, చంద్రకళ, పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి
రత్నం రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment