కేటీఆర్‌పై అక్రమ కేసులు పిరికిపంద చర్య
గ్రంథాలయ మాజీ చెర్మన్ గోవింద్‌నాయక్
ములుగు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమంగా కేసు నమోదు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవింద్‌నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులకు పాల్పడుతుందని అన్నారు. ఈ–ఫార్ములా కార్ రేసింగ్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ప్రఖ్యాతిని పెంచాలని కేటీఆర్ భావించారని అన్నారు. అలాంటి వ్యక్తిని కేసుల్లో అక్రమంగా ఇరికించే ప్రయత్నాన్ని ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో ఈ–ఫార్ములా అంశంపై చర్చించాలని అన్నారు. ఇప్పటికై నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పద్ధతి మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్, జిల్లా నాయకుడు భూక్య జంపన్ననాయక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాసమల్ల సురేందర్, మోరె రాజన్న, గడ్డమీది భాస్కర్, ఆదిరెడ్డి, రాందాస్, సమ్మయ్య, రఘు, తిరుపతి, దేవేందర్‌రావు, రాజు, తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ సమస్యలు
పరిష్కరించాలి
భూపాలపల్లి అర్బన్: విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ టీఆర్‌టీఎఫ్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టెన్త్ స్పెషల్ క్లాసులకు హాజరవుతున్న విద్యార్థులకు టిఫిన్స్, స్నాక్స్ ఇప్పించాలన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. స్కావెంజర్లకు వేతనాలు చెల్లించాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సమగ్ర కుటుంబ సర్వే రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మధుసూదన్, రవీందర్, శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment