అట్టహాసంగా జిల్లా స్థాయి క్రీడలు
ములుగు రూరల్: సీఎం కప్–2024 జిల్లా స్థాయి క్రీడలు మండలంలోని జాకారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం జిల్లా యువజన క్రీడల అధికారి తుల రవి వాలీబాల్ క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభించారు. వాలీబాల్ ప్రధమ స్థానం ఏటూరునాగారం, ద్వితీయ స్థానం కన్నాయిగూడెం విద్యార్థులు సాధించారు. వాలీబాల్ బాలికల విభాగంలో ఏటూరునాగారం ప్రధమ స్థానం, తాడ్వాయి ద్వితీయ స్థానంలో నిలిచారు. జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన జట్లకు మెడల్స్, ప్రశంసపత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ సెక్రటరీ బల్గూరి వేణు, వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుండబోయిన మల్లయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment