రామప్పలో విద్యార్థుల సందడి
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ది చెందిన రామప్ప దేవాలయంలో శుక్రవారం విద్యార్థుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధికసంఖ్యలో తరలివచ్చి రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టతను వివరించగా విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి నందీశ్వరుడి వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. రామప్ప గార్డెన్‌లో ఆటలాడుతూ ఉల్లాసంగా గడిపారు.
రేపు కాకతీ కదనభేరి సభ
ములుగు రూరల్: ఈ నెల 22న వరంగల్ నగరంలోని ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న కాకతీ కదనభేరి సభను ఉద్యోగ, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అన్నవరం రవికాంత్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో సభకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానంను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మహిపవన్, సమ్మయ్య, నర్సింహస్వామి, తిరుపతి, వీరస్వామి, సూరయ్య, నరహరి, శశికాంత్, సరిత, కిరణ్, నాగేశ్వర్‌రావు, సంజీవ, మొగిలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment