11వ రోజుకు చేరిన సమ్మె
ములుగు : తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని సమగ్రశిక్ష ఉద్యోగులు చేపడుతున్న సమ్మె 11వ రోజుకు చేరుకుంది. జిల్లాకేంద్రంలోని పోస్టాఫీస్ కార్యాలయం పక్కన శుక్రవారం ముగ్గులు వేసి నిరసన చేపట్టారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి పే స్కేల్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి కుమార్ పాడ్య, మహిళా అధ్యక్షురాలు జీవనప్రియ, ఉపాధ్యక్షురాలు ఎండీ ఫిరోజ్, కార్యవర్గ సభ్యులు సుజాత, రమేష్, సమన్వయ కర్తలు స్వాతి, ప్రవీణ్, విష్ణు, తిరుమల, స్వప్నలత, చిరంజీవి, విజయ్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.
న్యాయం జరిగే వరకు పోరాడుతాం
వెంకటాపురం(కె) : కొమరంభీమ్ కాలనీ ఆదివాసీ కుటుంబాల వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని గోండ్వాన సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రేగ గణేశ్ అన్నారు. గోండ్వాన సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరుకోగా శుక్రవారం చింత మోహన్, వెంకటకృష్ణ, పూనెం ప్రతాప్‌లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలను గిరిజనేతరులకు తాకట్టు పెడుతున్న అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు. 20 ఏళ్లుగా సాగులో ఉన్న భూములకు 145 సెక్షన్ ఎలా పెడతారని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆదివాసీల పక్షాన పనిచేయలేని పక్షంలో ఇలాంటి ఉద్యమాలు కొనసాగుతాయని హెచ్చరించారు.
శ్రీసరస్వతి అమ్మవారికి
అభిషేక పూజలు
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీచంద్రశేఖరాలయంలో శ్రీసరస్వతిపీఠం ఉపాసకురాలు ఆనంది ఆమె స్నేహితుడు వికాస్ ఆధ్వర్యంలో శ్రీసరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేశారు. అభిషేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం గ్రామంలోని పురవీధుల గుండా అమ్మవారి ఉత్సవ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవస్థానం రిటైర్డ్ అర్చకులు శ్రీరాంబట్ల ప్రశాంత్‌శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాధవి, కాంగ్రెస్ నాయకులు కామిడి శ్రీనివాసరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
భూపాలపల్లి అర్బన్: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై శ్రీలత తెలిపారు. గణేష్‌చౌక్ నుంచి అక్రమంగా మహారాష్ట్రకు టాటా మినీ వ్యాన్ వాహనంలో సుమారు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను తనిఖీ చేస్తూ ఆ వాహనాన్ని అడ్డుకొని పట్టుకున్నట్లు తెలిపారు. భూపాలపల్లి, గణపురం మండలాల్లోని పలు గ్రామాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు.
దీక్ష భగ్నం
భూపాలపల్లి రూరల్: రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా విద్య, వైద్యం అందించాలని ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష శుక్రవారం నాటికి 3వ రోజుకు చేరుకోగా రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేశారు. రవీందర్ మూడు రోజులుగా ఆహారం, పానీయాలు తీసుకోకపోవడంతో నీరసించిపోయాడు. దీంతో పోలీసులు రవీందర్‌ను చికిత్స నిమిత్తం 100 పడకల ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment